
కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ చిత్రంతో విక్రమ్ వారసుడిగా ధ్రువ్ పరిచయం అయ్యాడు. అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌గా తమిళ్‌లో విడుదలైంది. అలా తొలి చిత్రంతోనే నటనలో సత్తా చాటుకున్న ధ్రువ్‌కు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాతి చిత్రం మహాన్ కూడా నేరుగా ఓటీటీలో స్ట్రమింగ్ కావడంతో సరైన థియేటరికల్ చిత్రం కోసం చాలా రోజులు వేచి చూశారు. అలాంటి సమయంలో దర్శకుడు మారీ సెల్వరాజ్ దృష్టిలో ధ్రువ్ పడ్డారు. ఫలితంగా బైసన్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 17వ తేదీన తమిళ్‌లో విడుదలైంది. అక్కడ అనూహ్య విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో అక్టోబర్ 24న విడుదల కానుంది.
ఈ చిత్రం ఒక్కసారిగా అతన్ని లైమ్ టైమ్‌లో తీసుకొచ్చింది. దీంతో ధ్రువ్ విక్రమ్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా డాడా చిత్రం ఫేమ్ గణేష్ బాబు దర్శకత్వంలో ధ్రువ్ విక్రమ్ తదుపరి నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు గణేష్ బాబు నటుడు ధ్రువ్ కోసం మంచి కథను సిద్ధం చేసినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్శకుడిగా గణేష్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్‌తో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.