అడవి దున్న హల్‌చల్

భయభ్రాంతుల్లో గ్రామస్తులు
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్‌చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్‌కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి