నాకు ఒక ఛాన్స్‌ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు | Vikram son Dhruv Vikram Speech In Telugu Goes Viral | Sakshi
Sakshi News home page

Dhruv Vikram: నాకు ఒక ఛాన్స్‌ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు

Oct 21 2025 8:00 PM | Updated on Oct 22 2025 11:09 AM

Vikram son Dhruv Vikram Speech In Telugu Goes Viral

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన  కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్‌ తెరకెక్కించగా.. పా.రంజిత్‌ సమర్పించారు. స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్‌ చాలానే కష్టపడ్డాడు. తమిళ్‌లో సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న బైసన్‌ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్‌ ప్రేక్షకుల కోసం ధ్రువ్‌ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్‌ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్‌ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్‌ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్‌ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్‌ ‍అదరగొట్టారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement