రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగా తాలూకా(Andhra King Taluka Movie). ఈ మూవీకి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కింగ్‌డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పప్పీ షేమ్ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. వివేక్- మెర్విన్ సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రంలో కన్నడ హీరో కీలక పాత్రలో నటించారు.


