మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అనే తెలుగు చిత్రాలతో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్)
ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో.. తమిళ హిట్ సినిమా 'బైసన్', కాంట్రవర్సీ చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా ఇదే వీకెండ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు కచ్చితంగా చూడాల్సినవి కాగా వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ వారంలో రవితేజ 'మాస్ జాతర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 17 నుంచి 23వ తేదీ వరకు)
అమెజాన్ ప్రైమ్
ద మైటీ నెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 19
ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21
నెట్‌ఫ్లిక్స్
బ్లాక్ టూ బ్లాక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17
బేబ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17
షాంపేన్ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19
బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21
ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21
హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21
డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21
హాట్‌స్టార్
ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19
ద రోజెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20
నాడు సెంటర్ (తమిళ సిరీస్) - నవంబరు 20
అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23
సన్ నెక్స్ట్
ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21
జీ5
ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21
(ఇదీ చదవండి: ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ ఎమోషనల్)


