తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో రెండు ఊహించనివి జరగబోతున్నాయి. పదివారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయేల్.. ఎట్టకేలకు పదకొండోవారం నామినేషన్స్‌లోకి వచ్చేశాడు. ఇక ఫ్రెండ్స్‌కు ఎక్కువ, ప్రేమికులకు తక్కువ అన్నట్లుగా ఉండే పవన్-రీతూల మధ్య పెద్ద అగాధం ఏర్పడనుంది. కారణం.. పవన్ రీతూని నామినేట్ చేశాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
నీకు కాన్ఫిడెన్స్ లేదు
రీతూ.. గేమ్‌లో వెనకబడిపోయింది. తనకు కాన్ఫిడెంట్ లేదు అని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు. కాన్ఫిడెన్స్ లేనిది నీకంటూ తిరిగి వాదించింది రీతూ. ఇమ్మూ.. భరణి ఆటలో పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టడం లేదన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకుముందులా ఆడలగలవా? పర్ఫామెన్స్ అంటే కేవలం టాస్కులే కాదు. ప్రతి టాస్క్ నాకు సాధ్యమైనంతవరకు ఆడుతున్నా అని వివరణ ఇచ్చాడు.

ఏడిపించేసిన పవన్
ఇక పవన్ (Demon Pavan).. రీతూని నామినేట్ చేశాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుంది. అది బాధగా ఉంది. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, నాపై నమ్మకం లేదంటూ హర్ట్ చేశావ్. ప్రతిసారి నీ మంచే కోరుకున్నా.. అంటూ కన్నీళ్లు దిగమింగుతూ పాయింట్లు చెప్పాడు.
మౌనంగా రీతూ
తనకు ఎదురొచ్చే ఎవరి నోరైనా మూయించే రీతూ (Rithu Chowdary).. ఈసారి మాత్రం మూగబోయింది. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్ తనను నామినేట్ చేస్తుంటే తట్టుకోలేక కన్నీళ్ల రూపంలో తన బాధను వ్యక్తపరిచింది. నామినేషన్స్ అయ్యాక నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా.. అని రెండు చేతులతో తల బాదుకుంది. ఎందుకరుస్తున్నావని పవన్ అడిగితే నా వల్ల కావడం లేదంది.

నామినేషన్స్‌లో ఆరుగురు
అందుకు పవన్ కూడా.. నావల్ల కూడా కావడం లేదని అరిచి వెళ్లిపోయాడు. మొత్తానికి ప్రోమో అయితే రీతూ-పవన్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేలాగే ఉంది. ఇకపోతే సంజన, రీతూ, దివ్య, డిమాన్, కల్యాణ్, ఇమ్మూ, భరణి నామినేషన్స్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తనూజ కెప్టెన్సీ పవర్‌తో రీతూని సేవ్ చేసినట్లు భోగట్టా!


