కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన చిత్రం బైసన్. ఇటీవలే దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 24న తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ధ్రువ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం నవంబర్ 21 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
కాగా.. ఈ చిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్‌న్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే బైసన్.
#BisonKaalamaadan is expected to be streaming on November 21 in #Netflix !#SaiSango #TAMILTVHouse #DhruvVikram #Pasupathy #AnupamaParameswaran #BisonKaalamaadanOnNetflix pic.twitter.com/QxFLAk6e7x
— TAMIL TV House (@tamiltvhouse) November 10, 2025


