తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్‌ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.
(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)
ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.
విజయ్.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)


