జపాన్‌ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం | Sanae Takaichi breaks glass ceiling as Japan's first female PM | Sakshi
Sakshi News home page

జపాన్‌ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం

Oct 21 2025 5:55 PM | Updated on Oct 21 2025 6:17 PM

Sanae Takaichi breaks glass ceiling as Japan's first female PM

జపాన్‌ దేశపు రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. జపాన్‌లో తొలి మహిళా ప్రధానిగా సనాయే టాకాయిచీ (Sanae Takaichi) ఎన్నికయ్యారు.  ఓ మహిళ జపాన్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి.   

ప్రధాని పదవికి షిగేరు ఇషిబా నిన్న రాజీనామా చేశారు. ఒక ఏడాదిపాటు జపాన్‌ ప్రధానిగా పని చేసిన ఆయన.. క్యాబినెట్‌తో సహా రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలోనే సనాయే టాకాయిచీని ప్రధానిగా ఎన్నుంది ఆ దేశ పార్లమెంట్‌. 

లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (LDP)కి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  1993లో స్వతంత్ర అభ్యర్థిగా లోయర్ హౌస్‌లోకి ప్రవేశించిన ఆమె.. 1996లో ఎల్డీపీలో చేరారు.  షిన్జో అబే మంత్రివర్గంలో  ఆమె మంత్రిగా పని చేశారు.

ఈ ఎన్నికతో జపాన్‌ రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కొత్త దిశలో మార్పు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement