France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం | Former French President Sarkozy starts 5 year prison sentence | Sakshi
Sakshi News home page

France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం

Oct 21 2025 3:27 PM | Updated on Oct 21 2025 4:46 PM

 Former French President Sarkozy starts 5 year prison sentence

పారిస్‌: అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణలకు సంబంధించి గత నెలలో జైలు శిక్ష ఖరారైన ఫ్రాన్స్‌ మాజీ అద్యక్షుడు నికోలస్‌ సర్కోజీ జైలు జీవితం ప్రారంభమైంది.  2007 ఫ్రాన్స్‌  అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియాకు చెందిన గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వ నుండి సర్కోజీ అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణల దరిమిలా నమోదైన ఈ  కేసులోని  కొన్ని అభియోగాలనను కొట్టివేయగా, ఒకదానిలో నికొలస్‌ సర్కోజీని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు  శిక్షను ఖరారు చేసింది.

సర్కోజీకి జైలు శిక్షను తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ సమయంలో జైలు శిక్ష తేదీ ఖరారు చేయని కోర్టు.. అటు తర్వాత ఆ తేదీని కూడా స్పష్టం చేయడంతో సర్కోజీకి తాజాగా జైలు జీవితం అనుభవించడానికి వెళ్లారు. పారిస్‌లోని లా సాంటే జైలులో సర్కోజీని ఉంచారు.

నికొలస్‌ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను దౌత్య సహాయంగా చెప్పకుండా స్వీకరించారని, అవి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు పలువురు ఆరోపించారు. అవినీతి, ప్రచారానికి అక్రమ నిధుల వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తదితర ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో సర్కోజీని న్యాయస్థానం దోషిగా ప్రకటించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదీ చదవండి:
చైనాకు యూఎస్‌ వార్నింగ్‌.. భయమంతా అదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement