
నేచురల్‌గా మెరిసే అందం ఆశికా రంగనాథ్ సొంతం! మినిమల్ స్టయిలింగ్ టిప్స్‌తోనే, ఒక కొత్త లుక్‌ని సింపుల్‌గా, క్లాసీగా, కంఫర్టబుల్‌గా చూపిస్తూ మ్యాజిక్ చేసేస్తోంది. ఆ విషయాలే మీకోసం! బయటకు వెళ్లేటప్పుడు నా ఫేవరెట్ హాక్ బ్రెయిడ్ వేసుకోవడం. బ్రెయిడ్‌ని ఓపెన్ చేస్తే వచ్చే సాఫ్ట్ వేవ్స్ నాకు బాగా ఇష్టం.
బ్లాక్ డ్రెస్‌లు, క్రాప్‌టాప్స్ నా ఆల్‌టైమ్ ఫేవరెట్. యాక్సెసరీస్ విషయానికి వస్తే సింపుల్ జ్యూలరీనే ఎంచుకుంటాను. గ్లామర్ మొత్తం సింప్లిసిటీలోనే ఉంది ఆశికా రంగనాథ్. ఇక్కడ ఆమె ధరించే చీర..బ్రాండ్: సాయి తనార్య, ధర: రూ. 22,000, జ్యూలరీ బ్రాండ్: వివంత్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
కనీ కనిపించని కనికట్టు
మెడలో ఒక్కసారిగా స్టోన్స్ మాత్రమే మెరుస్తూ కనిపిస్తే అదే ఇన్విజిబుల్ చైన్ మ్యాజిక్. గొలుసు కనిపించకపోయినా, పెండెంట్ మాత్రం గ్లామర్‌తో మెరుస్తుంది. చీర మీద క్లాసీగా, గౌన్ మీద గ్లామరస్‌గా, డైలీ వేర్‌లో క్యూట్‌గా ఏ లుక్‌కైనా ఈ ఇన్విజిబుల్ చైన్ సెట్ అవుతుంది. చిన్న పెండెంట్ వేసుకుంటే సింపుల్‌గా, సాఫిస్టికేటెడ్ లుక్ ఇస్తుంది. పెద్ద స్టోన్ పెండెంట్ అయితే స్పాట్‌లైట్‌లో ఉండే జ్యూలరీ అవుతుంది.
ఫొటోల్లో ఈ పెండెంట్ లైట్‌ని క్యాచ్ చేస్తూ అదిరిపోయే గ్లో ఇస్తుంది. హెవీ జ్యూలరీ మానేసి, ఈ ఇన్విజిబుల్ చైన్ విత్ పెండెంట్‌ని వేసుకుంటే, నేచురల్ బ్యూటీ ఇంకో లెవెల్‌కి హైలైట్ అవుతుంది. జుట్టు లూజ్ వేవ్స్‌గా వదిలేస్తే క్లాసీ లుక్, హై బన్ చేస్తే ఎలిగెంట్ లుక్ మీ సొంతం. మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్, కలర్‌ఫుల్ డిజైన్స్ లైట్‌వెయిట్ ఆప్షన్లతో దొరుకుతున్నాయి. ఇదొక ఆభరణం మాత్రమే కాదు, అది న్యూ ఏజ్ ట్రెండ్, స్టయిల్ సీక్రెట్ కూడా!
(చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!)