
అందాల పోటీకి సంబంధించి భారత్‌కి.. 1994 అతి ప్రాధాన్యత సంతరించుకున్న ఏడాది. ఎందుకంటే ఆ ఏడాదే ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలు రెండూ దక్కాయి. 28 ఏళ్ల తర్వాత రీటా ఫారియా తదనంతరం ఇద్దరు సుందరీమణులు ఈ ఘనతను దక్కించుకున్నారు. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ ఆ ఘన కీర్తిని భారత్‌కు అందించారు. దేశమే గర్వించేలా చేశారు. అయితే వీళ్లిద్దరూ మిస్ ఇండియా ఫైనల్లో తలపడ్డాడరు. కానీ కిరీటం సుస్మితా సేన్‌నే వరించింది. నిజానికి ఐశ్వర్యనే గెలుస్తుందనేది అందరి నమ్మకం. ఇలా ఎందుకు జరిగిందో నాడు పోటీల్లో పాల్గొన్న సహ పోటీదారురాలు రూబీ భాటియా ఆ విషయాన్ని వివరించింది. ఆఖరికి సుస్మితా సైతం గెలుపొందుతానని అనుకోలేదంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మిస్ యూనివర్స్‌గా సుస్మితాకు కిరీటం ఎందుకు దక్కిందో కూడా వివరించారామె.
1994 మిస్ ఇండియాలో పోటీల్లో రూబీ భాటియా కూడా పాల్గొన్నారు. అయితే సుస్మితా సేన్(Sushmita Sen ) మిస్ ఇండియా(Miss India) కిరీటాన్ని(crown) గెలుచుకుందని, ఐశ్వర్య రన్నరప్‌గా నిలిచారంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. నిజానికి జ్యూరీ ప్యానెల్ ఆ సమయంలో మోడలింగ్‌లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)ను కాదని సుస్మితాను ఎందుకు ఎంచుకుందో వివిరించింది.
నాడు పోటీల్లో ర్యాంప్‌పై నడుస్తుండగా ఐశ్వర్య జారిపడింది..అందువల్ల సుస్మితాను మిస్ ఇండియా కిరీటం వరించిందేమో అనుకున్నా కానీ..అది నిజం కాదని అందుకు ప్రత్యేక కారణం ఉందంటూ అసలు విషయం చెప్పారామె. నాటి మిస్ ఇండియా పోటీల్లో న్యాయనిర్ణేతల్లో ఒకరైనా ఫెమినా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ వవిమ్లా పాటిల్‌ని దీని గురించి అడిగానని, ఐశ్వర్య ర్యాంప్‌పై స్లిప్ అవ్వడం వల్ల కిరీటం చేజారిపోలేదని తేల్చి చెప్పారంటూ నాటి సంగతి వివరించింది.
మిస్ యూనివర్స్‌కి పోటీపడటానికి నిర్ధిష్ట లక్షణాలు గల పోటీదారుడి కోసం వెతుకుతున్నామని..ఆ నేపథ్యంలోనే సుస్మితాను విజేతగా ప్రకటించినట్లు ఆమె చెప్పారని రూబీ చెప్పుకొచ్చింది. అంతేగాదు మిస్ యూనివర్స్‌గా సుస్మితా, మిస్ వరల్డ్‌గా ఐశ్వర్య ఎందుకు సరిపోతారో కూడా ఆమె వివరించినట్లు తెలిపింది.
మరి వారే ఎందుకంటే..
మిస్ యూనివర్స్ తెలివైన, అందం కలిగిన మహిళ కోసం అని, అందుకు సుస్మితా సేన్ సరిపోతుందని ఆమె చెప్పినట్లు రూబీ పేర్కొంది. మిస్ వరల్డ్ అంటే మరింత కలలు కనే అందమైన దివా మహిళ అని అందుకు ఐశ్వర్య తగినదని అందుకే ఆ ఇద్దరు చెరొక అంతర్జాతీయ టైటిళ్లను కైవసం చేసుకున్నారని రూబీ చెప్పుకొచ్చింది.
అలాగే సుస్మితా కూడా ఓ ఇంటర్వ్యూలో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య కూడా పోటీపడనుందని తెలిసి..నాకు కిరీటం వచ్చే ఛాన్సే లేదనే అనుకున్ననని స్వయంగా వెల్లడించింది కూడా. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేటప్పుడూ అన్ని అనుమానాలు, భయాలతో పాల్గొన్న సుస్మిత..చివరికి ఊహించని విధంగా కిరీటం గెలుకుని మిస్ యూనివర్స్ టైటిల్‌ని అందుకుంది, ఐశ్వర్య మిస్ వరల్డ్‌గా గెలుపొదింది. చివరికి ఇద్దరూ..చరిత్రలో తమ పేర్లను లిఖించుకున్నారు.
(చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!)