
చిత్రంలోని ఈ మిర్రర్ ఒక స్మార్ట్ బ్యూటీ గాడ్జెట్. ఇది మీ అందాన్ని, చర్మ సంరక్షణను మెరుగుపరచడానికి రూపొందించబడింది. సాధారణంగా ఇంట్లో ఉపయోగించే అద్దానికి అధునాతన సాంకేతికతను జోడించి స్మార్ట్ డివైస్‌గా మార్చారు. ఈ అద్దం ముఖాన్ని విశ్లేషించి, చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు, ఎర్రటి గుల్లలు, గీతలు, చర్మ రంధ్రాలు, నల్లటి వలయాలను ఇట్టే గుర్తిస్తుంది. ఇది ఒక సమగ్ర చర్మ నివేదికను అందించి, ఏ ఉత్పత్తులు వాడితే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది. అలాగే ఈ మిర్రర్‌కి ఉన్న ఎల్‌ఈడీ లైట్లు చాలా ప్రత్యేకమైనవి.
ఇవి వివిధ రకాల వాతావరణాలను అనుకరిస్తాయి. ఉదాహరణకు, సన్ లైటింగ్, ఆఫీస్ లైటింగ్, షాపింగ్ మాల్స్ లైటింగ్, నార్మల్ లైటింగ్, నైట్ లైటింగ్ ఇలా ఐదు రకాల లైటింగ్ మోడ్‌లను ఇది అందిస్తుంది. దీనితో మీరు వేసే మేకప్ వివిధ ప్రదేశాల్లో ఎలా కనిపిస్తుందో ముందే తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ డివైస్ 64జీబీ సామర్థ్యంతో ఏర్పడింది. దాంతో చర్మ ఆరోగ్య నివేదికలు, మేకప్ స్టైల్ వీడియోలు ఇలా డేటాను సురక్షితంగా నెట్ సాయంతో సేవ్ చేసుకోవచ్చు.
అదనంగా, ఈ డివైస్ ఏకకాలంలో నాలుగు యూజర్ అకౌంట్లను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒకే అద్దాన్ని కుటుంబంలోని నలుగురు సభ్యులు వాడుకోవచ్చు. దీనికి ఒక వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఇది చాలా సౌకర్యవంతమైన ఫీచర్. ఈ అద్దాన్ని సులభంగా పోర్ట్‌రైట్ (నిలువుగా) లేదా ల్యాండ్‌స్కేప్ (అడ్డంగా) మోడ్‌లోకి మార్చుకోవచ్చు.
దీనివల్ల ఈ డివైస్‌లో యూట్యూబ్ వీడియోలు లేదా ఇతర కంటెంట్‌ను చూస్తున్నప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇదే స్మార్ట్ మిర్రర్స్‌లోని కొన్ని మోడల్స్‌లో వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. దాంతో చేతులు ఉపయోగించకుండానే వాయిస్ కమాండ్స్‌తో అద్దాన్ని నియంత్రించవచ్చు.
కుంకుమ పువ్వు, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ముఖానికి ప్రత్యేకమైన మెరుపునిస్తుంది. ఒక పావు టీ స్పూన్ కుంకుమ పువ్వుని, ఒక టేబుల్ స్పూన్ పాలలో రాత్రి అంతా నానబెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఆ పాలలో కలబంద గుజ్జు వేసి క్రీమీగా చేసుకోవాలి.
ఆ మిశ్రమంలో ఎండబెట్టిన గులాబీ రేకుల గుజ్జును అర టీ స్పూన్ వేసుకుని, బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అనంతరం సుమారు 30 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు.