చలి... చర్మ సమస్యలూ, జాగ్రత్తలు..! | Beauty tips: Essential Winter Skin Care Routine for Healthy Skin | Sakshi
Sakshi News home page

చలి... చర్మ సమస్యలూ, జాగ్రత్తలు..!

Dec 2 2025 12:26 PM | Updated on Dec 2 2025 12:26 PM

Beauty tips: Essential Winter Skin Care Routine for Healthy Skin

శీతకాలంలోని చల్లటి వాతావరణంలో చలి ప్రభావం నేరుగా చర్మం మీదే పడుతుంది. అందుకే ఆ చలి బాధను మొదట అనుభవించేది చర్మమే. పైగా ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ బాగా తగ్గి΄ోవడంతో... దాన్ని మళ్లీ భర్తీ చేయడానికి  మన చర్మం నుంచే తేమను అప్పుడున్న వాతావరణం లాగేస్తుంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో చర్మం పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఫలితంగా ఈ సీజన్‌లో చర్మంపై గోటితో గీరగానే గీతలు పడుతుంటాయి. 

అంతేకాదు.. ఈ సీజన్‌లో ఇతర అలర్జీలతో పాటు చర్మ–అలర్జీలూ పెరుగుతాయి. ఫలితంగా చర్మం పగలడం, కాళ్లు పగుళ్లు ప్రస్ఫుటంగా కనిపించే ఎగ్జిమా వంటి కేసులు పెరుగుతాయి. అందువల్ల మరీ ముఖ్యంగా మడమలు పగలడం కూడా ఈ సీజన్‌లోనే చాలా ఎక్కువ. ఇలా మడమల పగుళ్లు కనిపించడమన్నది యువతులు, మహిళల్లో మరికాస్త ఎక్కువ.

ఎగ్జిమా : కాళ్లూ, చేతులు పగుళ్లబారి కనిపించడం ఎగ్జిమా తాలూకు ప్రధాన లక్షణం. ఈ సీజన్‌లో చలి కారణంగా పెరిగి΄ోయి కనిపించే కేసుల్లో ఎగ్జిమానే ఎక్కువ. అందుకే దాని నివారణ, చికిత్సల గురించి తెలుసుకుందాం.

నివారణ, చికిత్స : ఎగ్జిమా నివారణ/చికిత్సలు ఇవి...  ∙దురద అంతగా లేనివారు సువాసన లేని, మామూలు హై΄ో అలర్జిక్‌ మాయిశ్చరైజర్స్‌ రాసుకుంటూ చర్మాన్ని సంరక్షించుకోవాలి. ∙ఒకవేళ దురద ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు (టాపికల్‌ మెడిసిన్స్‌) వాడాలి.

హౌజ్‌వైఫ్‌ డర్మటైటిస్‌ : పేరునుబట్టి ఇది గృహిణులకు మాత్రమే వచ్చే సమస్యగా అనిపించవచ్చు గానీ అది నిజం కాదు. కొన్నిసార్లు మధ్యవయస్కులతో ΄ాటు, యువతుల్లోనూ కనిపిస్తుంది. అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు ‘హౌజ్‌వైఫ్‌ డర్మటైటిస్‌’ ముప్పు ఎక్కువ. ఈ వయసు మహిళలు... తాము ముఖం కడుక్కోవడానికి వాడే సబ్బులు, బట్టలు ఉతకడం కోసం వాడే డిటర్జెంటు సబ్బులు, ΄ûడర్లు; అలాగే కొన్ని సందర్భాల్లో వారు ముఖానికి పసుపు, కుంకుమ  రాసుకోవడం కారణంగా ముఖం బాగా ΄÷డిబారి΄ోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురదలు వస్తాయి. ఈ సమస్యనే ‘హౌజ్‌వైఫ్‌ డర్మటైటిస్‌’ అంటారు. 
నివారణ : ∙తమకు అలర్జీ కలిగించే అన్ని రకాల పదార్థాలను గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండటం. ∙మడమలు పగలినవారు శాల్సిలిక్‌ యాసిడ్‌ ఉండే కాంబినేషన్‌ క్రీములు వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాళ్లు పగిలిన వారు రాత్రి వేళ సాక్స్‌ ధరించి పడుకోవడం వల్ల మడమల పగుళ్లు చాలావరకు తగ్గుతాయి.

చలికాలంలో పూర్తిస్థాయి చర్మ సంరక్షణ కోసం... 
చలికాలంలో బాగా పొగలుగక్కే వేణ్ణీళ్లు మంచివి అని కొందరు పొరబడుతుంటారు.  ఇది కేవలం అ΄ోహ మాత్రమే. నిజానికి ఈ సీజన్‌లోని వాతావరణం మన చర్మం నుంచి తేమను లాగేస్తుంటుంది. ఫలితంగా వేడినీళ్లతో స్నానం చర్మాన్ని మరింత పొడిబార్చే ప్రమాదం ఉంది. అందుకే స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడటమే మేలు 

స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్‌ సబ్బు వాడటం కూడా మంచిదే 

చల్లటి వాతావరణంలో దాహం వేయక΄ోవడంతో నీరు తాగడం తగ్గించడం సరికాదు. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగడమే మంచిది 

అరచేతులు, పాదాలు పగిలినవాళ్లు పాదాలకూ సాక్స్, చేతులకూ కాటన్‌ గ్లౌజ్‌ ధరించడం మంచిది 

పెదవులు పగలకుండా పెట్రోలియమ్‌ జెల్లీగానీ లేదా లిప్‌ బామ్‌గానీ పెదవులపై తరచూ రాసుకుంటూ ఉండటం మంచిది 

చలికాలమే అయినప్పటికీ తగినంత ఎస్‌పీఎఫ్‌ ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాసుకుంటూ ఉండటం మంచిది. 

(చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement