ప్రకృతి ప్రసాదించిన సహజ పదార్థాలను ఉపయోగించి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు.
ఫేషియల్ స్క్రబ్:
ఒక టేబుల్ స్పూను చక్కెరలో ఆరు చుక్కల ఆలివ్ అయిల్ కాని కొబ్బరినూనె కాని కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. శీతకాలంలో మోచేతుల దగ్గర చర్మం గట్టిపడుతూంటుంది, ఇలాంటిచోట్ల కూడా ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. పాదాలకు కూడా ఇదే పద్ధతి.
ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో అంతే మోతాదులో ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. చక్కెరకు బదులుగా ఉప్పు వాడినట్లయితే కొన్ని రకాల చర్మ సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.
నైట్ క్రీమ్
ఒక నిమ్మచెక్క రసం తీసి అందులో ఒక కప్పు పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి రాత్రంతా ఉంచుకోవాలి.
(చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు)


