28 కోట్ల రూపాయల చేపల కూర | 243kg Bluefin Tuna Sold For 28 Crore At Tokyo Fish Market Auction Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

28 కోట్ల రూపాయల చేపల కూర

Jan 10 2026 10:47 AM | Updated on Jan 10 2026 11:30 AM

243kg bluefin tuna sold for 28 crore at tokyo fish market auction

ఇక్కడ ఒక వ్యక్తి భారీ చేప తల పట్టుకుని నిలుచుని ఉన్నాడు కదూ. ఆ తల 243 కేజీల బరువు ఉన్న బ్లూఫిన్‌ టూనా చేపది. సముద్రంలో పట్టిన ఈ భారీ టూనా చేపను న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా టోక్యో చేపల మార్కెట్‌లో వేలం వేశారు. జపనీయులకు టూనా చేప చాలా ఇష్టం. దాంతో కూర వండుకొని లొట్టలు వేస్తూ తింటారు. అందుకే అక్కడ టూనా చేపకు చాలా గిరాకీ. అలాంటిది 243 కేజీల భారీ చేప అంటే ఎంత డిమాండ్‌ ఉంటుందో అర్థం చేసుకోండి. వేలంలో ఐశ్వర్యవంతులంతా పోటీ పడగా ఒక వ్యాపారవేత్త 28 కోట్ల రూపాయలు చెల్లించి చేపను సొంతం చేసుకున్నారు. 28 కోట్లు! బాప్‌ రే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement