బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు పాలు పట్టగా మిగిలిన పాలను ప్రభుత్వ ఆస్పత్రులకు దానం చేశారు. తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించిన గుత్తాజ్వాల దాదాపు 30 లీటర్ల వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. ఇలా చేయడం ద్వారా పాలుపడని తల్లుల పిల్లల ప్రాణాలను కాపాడగలిగారు. గుత్తాజ్వాల తనలో ఉన్న మాతృహృదయాన్ని చాటడంతోపాటు తల్లిపాలకు ఎంత ప్రాధాన్యం ఉందో సమాజానికి చెప్పగలిగారు. ఇలాంటి తల్లులు మరింత మంది ముందుకొస్తే అమ్మపాలు దొరకని శిశువుల ప్రాణాలు కాపాడే అవకాశముంది. ప్రభుత్వం సైతం మిల్‌్కబ్యాంక్‌లు ఏర్పాటు చేస్తోంది.
తల్లి ఒడిలో హాయిగా పడుకొని పాలు తాగాల్సిన నవజాత శిశువులు అమ్మ అమృతధార కోసం పోరాడాల్సిన పరిస్థితి. పౌష్టికాహార లేమి.. అనారోగ్య సమస్యతో తల్లికి పాలు పడక అప్పుడే పుట్టిన చిన్నారులకు అమృతధారలు అందడం లేదు. ఫలితంగా నవజాత శిశుమరణాలు పెరుగుతున్నాయి. పాలు పడని తల్లుల పిల్లల ప్రాణాలు నిలిపేందుకు పలువురు తల్లులు తమ పాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచి్చన మాతృమూర్తుల అమృతధారలను నిల్వ చేసే మిల్‌్కబ్యాంక్ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్‌్కబ్యాంకులు ఎక్కడా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నవజాత శిశువులు పాల కోసం తల్లడిల్లుతున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ మిల్‌్కబ్యాంక్‌లు ఏర్పాటు చేస్తే చాలా మంది తల్లులు తమ పాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది.
పాలు ఎంతో ఉపయోగపడ్డాయి
నాకు పాలు పడకపోవడంతో బిడ్డ ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డా. కానీ మరో తల్లి నుంచి సేకరించిన పాలను నా బిడ్డకు పట్టించారు. ఆ పాలు నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాయి. – లావణ్య, పోతారం, హుస్నాబాద్
తల్లిపాలతోనే ఆరోగ్యం
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందిస్తాయి. శిశువు రోగనిరోధక శక్తిని పెంచి వ్యా ధుల నుంచి కాపాడుతాయి. మేధస్సు, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో సహాయపడుతాయి. తల్లి శిశువు మధ్య ప్రేమానూబంధాన్ని మరింత బలపరుస్తాయి.
– డాక్టర్ నవీనా, ఆర్‌ఎంవో, కరీంనగర్
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలతో మదర్ మిల్‌్క బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో తల్లిపాలు అందని నవజాత శిశువులకు ఈ బ్యాంక్ ద్వారా పాలు అందించడమే లక్ష్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023 మార్చి 8న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మిల్క్ బ్యాంక్‌లో బ్రెస్ట్ పంప్ ద్వారా తల్లుల నుంచి పాలు సేకరించి, భద్రపరచి అవసరమైన శిశువులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అకాల ప్రసవాలు, తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు ఈ మిల్‌్కబ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది. శిశుమరణాలు తగ్గించడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా సేవలందిస్తున్నారు.
శిశు మరణాలు అరికట్టడమే లక్ష్యంగా..
తల్లిపాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. అతిసారం, న్యుమోనియా నివారించవచ్చు. తల్లివద్ద పాలు లేకపోతే ఆ శిశువులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం తల్లి పాల బ్యాంకులను ప్రారంభించింది. ఎక్కువగా పాలు ఉన్న తల్లుల నుంచి సేకరించి పాలు అందని పిల్లలకు అందిస్తూ కాపాడుతున్నారు. ఈ ఏడాది ఎంసీహెచ్‌వో 4,754 డెలివరీలు జరగగా.. 114 మంది శిశువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే ఈ సంఖ్య గతంతో పో లిస్తే తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండా పుట్టినా.. తక్కువ బరువుతో పుట్టిన శిశువుల కు ఎంసీహెచ్‌లో ఏర్పాటు చేసిన తల్లిపాల బ్యాంకు, ఎస్‌ఎన్‌సీయూ వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తుంది.
12 గంటలపాటు నిల్వ
తల్లి నుంచి సేకరించిన పాలను 12 గంటల పాటు ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లో నిలువ చేసే అవకాశం ఉంది. కానీ ఏ రోజు కూడా అంత సమయం నిలువ ఉంచే పరిస్థితి రాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిల్‌్క బ్యాంక్‌లో పాలను సేకరించే తల్లులకు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు, వైద్యుల పర్యవేక్షణలోనే పాలసేకరణ, పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ప్రతీ నెల 300 మంది తల్లుల నుంచి పాలు సేకరించి ప్రతీ రోజు 5 నుంచి 8 మంది పిల్లలకు అందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందని వారికి ఈ బ్యాంకు ద్వారా అందించి ప్రాణాలు కాపాడుతున్నారు.
పాల బ్యాంకు వరం
నా భార్య డెలివరీ తర్వాత పాపకు పాలు అందకపోవడంతో మిల్క్ బ్యాంకు నుంచి సేకరించిన పాలు అందిస్తున్నారు. పాలు అందని పిల్లలకు మాతాశిశు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తల్లి పాల బ్యాంకు ఒక వరం.
– చంద్రశేఖర్, జగిత్యాల
శిశువుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
తల్లిపాలతోనే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పాలను కూడా అన్ని రక్షణ చర్యలు తీసుకుని మిగతా శిశువులకు అందించేలా మిల్‌్కబ్యాంకులో ఏర్పాటు చేశాం. హెచ్‌ఐవీ, హెపటైటిస్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన తల్లుల పాలు మాత్రమే తీసుకుంటాం.
– డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్, కరీంనగర్


