ఇద్దరు ఐపీఎస్ అధికారులు తమ సేవలతో స్ఫూర్తిగా నిలిచారు. ఆ దారిలో నడిచేలా కొత్త తరం ఐపీఎస్‌లకు రోల్‌మోడల్స్ ఆ ఇద్దరూ. ఒకరు దోపిడిదారులను గజగజలాడించిన అధికారి కాగా మరొకరు దర్యాప్తులతో కేసులను చేధించడంలో మేటి. పైగా ఇద్దరు శౌర్య పతాక గ్రహితలు కూడా.
ఆ ఇద్దరే దల్జిత్ సింగ్ చౌదరి, తిలోత్మ వర్మలు. ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులే. ఇటీవలే వీరిద్దరు పదవీవిరమణ చేశారు. ఈ ఇద్దరి కెరీర్ నిర్భయమైన ఫీల్డ్ పోలీసింగ్, సంస్థాగత నిర్మాణం, వంటి సేవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అధికారులు.
దల్జిత్ సింగ్ చౌదరి:
యూపీ చంబల్ సరిహద్దు ప్రాంతాలలో చౌదరి పేరు దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలకు పర్యాయపదంగా ఉండేది. దల్జిత్ తన కెరీర్ ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు ప్రతి ప్రధాన జిల్లాలో పనిచేశారు. అత్యంత భయంకరమైన ముఠాలను నిర్మించాడు. యుద్ధ క్షేత్రంలో ముందుండి నడిపించి శాంతిని నెలకొల్పే వ్యక్తిగా ఖ్యాతిని అందుకున్న వ్యక్తి దిల్జిత్. అంతేగాదు రాష్ట్ర అంతర్గత భద్రతా వాతావరణాన్ని స్థిరీకరించడంలో కీలకపాత్ర పోషించిన యోధుడు.
ఆయన కేంద్ర డిప్యుటేషన్‌పై ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్, సశస్త్ర సీమా బల్ (డైరెక్టర్ జనరల్‌గా)లో ఉన్నత పదవులు నిర్వహించి, చివరకు 2024లో సరిహద్దు భద్రతా దళ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన నాయకత్వం ఉత్తరప్రదేశ్ దాటి విస్తరించింది. ఆయన నిర్ణయాలు చాలా లోతుగా సమగ్రతతో ఉంటాయని కొనియాడారు డీజీ బినోద్ సింగ్. కాకోరిలోని హాజీ కాలనీలో ఐసిస్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద అనుమానితుడు సైఫుల్లాపై 2017లో జరిగిన ఏటీఎస్-లక్నో పోలీసు ఆపరేషన్‌ను రాత్రంత మేల్కొని పర్యవేక్షించి దిగ్విజయం పూర్తి చేశారంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు బినోద్ సింగ్.
అందుకుగానూ దిల్జిత్‌ను నాలుగు శౌర్య పతాకాలు వరించాయి కూడా. కేవలం అధికారి మాత్రమే కాదు బిల్జిత్ జాతీయ స్థాయి షూటర్, శిక్షణ పొందిన స్కైడైవర్ కూడా.
తిలోత్మా వర్మ:
ఇక్కడ దిల్జిత్ యుద్ధభూమిలో పోలీసింగ్‌కు ప్రతీక అయితే తిలోత్మా వర్మ దర్యాప్తు నైపుణ్యం కలిగిన వ్యక్తి. 1965లో సిమ్లాలో జన్మించిన ఆమె 1990లో ఐపీఎస్‌లో చేరి, అత్యంత వైవిధ్యభరితమైన పదవులను అలంకరించారామె. 2002లో జాతీయ దృష్టిని ఆకర్షించి రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకాన్ని అందుకున్న యూపీ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా ఘనత సాధించింది. అలాగే హత్రాస్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో నాటకీయ రక్షణలో, వర్మ - ఒక చేతిలో ఇద్దరు పిల్లలను మరొక చేతిలో తుపాకీని పట్టుకుని సాయుధ నేరస్థులను నిలవరిస్తున్న ఫోటో భారత పోలీసింగ్‌లో మహిళా నాయకత్వానికి అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకటిగా నిలిచింది.
అంతేగాదు ఆమె సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లో అసిస్టెంట్ అండ్ డిప్యూటీ డైరెకర్టర్ కూడా పనిచేశారు. అలాగే 2006–2011 మధ్య CBIలో DIGగా(అవినీతి నిరోధక విభాగం) రాజకీయ నాయకులతో కూడిన ప్రధాన దర్యాప్తులను కూడా పర్యవేక్షించారు. అయితే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మాత్రం వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB)లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నప్పుడే. ఎందుకంటే ఆమె నాయకత్వంలో ప్రధాన పులుల వేట సర్యూట్‌లను నిర్మూలించింది.
కొన్ని ప్రాంతాలలో పులల సంఖ్య ఆందోళనకరమైన స్థాయికి పడిపోయిందంటున్న నిపుణులన హెచ్చిరికలను తిప్పికొట్టేలా.. పులుల సంఖ్య పెరిగేలా కృషి చేసింది. అందుకుగానూ బావిన్ వైల్డ్‌లైఫ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అవార్డు, మూడు ఆసియా ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అవార్డులు, UN శాంతి పరిరక్షక పతకం వంటి పలు అవార్డులు వరించాయి.
2024లో డీజీగా బాధ్యతలు చేపట్టి పాఠ్యాంశాల ఆధునీకరణ, లింగ సమానత్వం, శాస్త్రీయ పోలీసింగ్, ప్రవర్తనా శిక్షణలో ప్రధాన సంస్కరణలు వంటివి ప్రవేశ పెట్టారు. 2025 మహా కుంభమేళాలో కూడా కీలక పాత్ర వహించి, స్వయంగా ప్రధాని మోదీచే ప్రశంసలందుకుంది తిలోత్మా వర్మ.
(చదవండి: జేఈఈ ప్రిపరేషన్ నుంచి రాష్ట్రపతి మెడల్ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..)


