ఐపీఎస్‌ పూరన్‌ కుటుంబ సభ్యులకు రాహుల్‌ పరామర్శ | Rahul Gandhi Meets Haryana Ips Officer Puran Kumar Family | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ పూరన్‌ కుటుంబ సభ్యులకు రాహుల్‌ పరామర్శ

Oct 14 2025 12:33 PM | Updated on Oct 14 2025 12:49 PM

Rahul Gandhi Meets Haryana Ips Officer Puran Kumar Family

చండీగఢ్‌: హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాన్‌ కుమార్‌ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి పురన్‌పై వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆపి పూరన్‌ అంత్యక్రియలు నిర్వహించాలంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ఒక ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలని రాహుల్‌ అన్నారు. 

ఈ నెల 7న పూరన్‌కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్‌ లెటర్‌లో పేర్కొన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాన్‌ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్‌లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా  విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్‌కు పయనమయ్యారు.

అయితే, తన భర్త మరణానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ పురాన్‌ కుమార్‌ భార్య అమ్నీత్‌ పీ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త ఐపీఎస్‌ పురాన్‌ కుమార్‌ను పోలీస్‌ శాఖలో పనిచేసి రిటైరైన ఉన్నాతాధికారులు, పలువురు పనిచేస్తున్న వారు వేధింపులకు గురి చేయడం,అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని  వాపోయారు. అందుకే ఆయన మరణించినా.. చండీగఢ్ పోలీసులు పట్టించుకోలేదని అమ్నీత్‌ పీ కుమార్‌ ఆరోపించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement