మహిళా పారిశుద్ధ్య కార్మికులను రుతుస్రావం రుజువు అడిగిన వర్సిటీ | SC issues notice on plea accusing Haryana university of demanding menstrual proof from women workers | Sakshi
Sakshi News home page

మహిళా పారిశుద్ధ్య కార్మికులను రుతుస్రావం రుజువు అడిగిన వర్సిటీ

Nov 29 2025 9:25 AM | Updated on Nov 29 2025 9:25 AM

SC issues notice on plea accusing Haryana university of demanding menstrual proof from women workers

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్‌ 

న్యూఢిల్లీ: హరియాణాలోని మహర్షి దయానంద్‌ వర్సిటీ యంత్రాంగం మహిళా పారిశుద్ధ్య కార్మికులను రుతు స్రావం రుతుస్రావం అయినట్లుగా ప్రైవేట్‌ పార్టుల ఫొటోలను చూపాలని కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది వారి మానసిక స్థాయికి ఇదో నిదర్శనమని మండిపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ మహదేవన్‌ల ధర్మాసనం కేంద్రానికి, హరియాణా ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 

‘ఇది వారి మానసిక వైఖరికి అద్దంపడుతోంది. ఒక వైపు కర్నాటకలో పీరియడ్స్‌ సమయంలో లీవు ఇస్తూంటే..ఇక్కడేమో లీవు కోసం ఆధారాలు అడుగుతున్నారు’అని జస్టిస్‌ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 15వ తేదీకి వాయిదా వేశారు. ఏమైందంటే..అక్టోబర్‌ 26వ తేదీన మహర్షి దయానంద్‌ వర్సిటీని గవర్నర్‌ ఆషిమ్‌ కుమార్‌ ఘోష్‌ సందర్శించారు. 

అందుకు కొద్ది గంటల ముందు ముగ్గురు మహిళా పారిశుధ్య కార్మికులను క్యాంపస్‌ శుభ్రం చేయాలంటూ ఇద్దరు సూపర్‌ వైజర్లు ఒత్తిడి చేశారు. పీరియడ్స్‌ కారణంగా తాము చేయలేకపోతున్నామనగా, అందుకు తగిన ఆధారాలను, ప్రైవేట్‌ భాగాల ఫొటోలను చూపించాలని వారు కోరారు. నిరాకరించడంతో పని నుంచి తొలగిస్తామంటూ బెదిరించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కేసు నమోదైంది. వర్సిటీ యాజమాన్యం ఆ ఇద్దరు సూపర్‌వైజర్లను తొలగించింది.  

Advertisement
 
Advertisement
Advertisement