
వయసుతో సంబంధం లేకుండా ఆడవారంతా తమ జుట్టును అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవాలనే కోరుకుంటారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా, అందరినీ ఆకట్టుకునేలా తమ కురులను మార్చుకోవాలని ఆశ పడతారు. అలాంటి వారి కోసం జుట్టును స్టైలిష్‌గా మార్చే పరికరమే ఈ డైసన్ ఎయిర్‌రాప్ ఐడీ 6 ఇన్ 1 మల్టీ స్టైలర్.
జుట్టు స్టైలింగ్ అంటే చాలామంది అధిక వేడి, జుట్టు చివర్లు చిట్లిపోవడం, గంటల తరబడి శ్రమ అని అనుకుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని చెబుతూ డైసన్ కంపెనీ ఈ పరికరాన్ని సృష్టించింది. ఈ డివైజ్ ఎక్కువ వేడి లేకుండా కేవలం ఎయిర్ ఫ్లో సాయంతో జుట్టును స్టైల్ చేస్తుంది. అధునాతన సాంకేతికతో ఇది మీ జుట్టుకు ట్రెండీ లుక్‌ను అందిస్తుంది. డైసన్ ఎయిర్‌రాప్ పరికరం బ్లూటూత్ కనెక్టివిటీతో పని చేస్తుంది. ముందుగా ఫోన్‌లో మై డైసన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇందులో మీ వెంట్రుకల తీరు, అలాగే మీరు ఎలాంటి స్టైల్ కోరుకుంటున్నారో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి స్టైల్ సరిపోతుందో కూడా సూచనలిస్తుంది. దీంతో జుట్టును ఎలా స్టైల్ చేసుకోవాలో అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న స్టైల్ ప్రకారం ఈ పరికరం మీ జుట్టుకు అందమైన రూపాన్ని ఇస్తుంది. డైసన్ ఎయిర్‌రాప్ ఆరు రకాల ఎటాచ్‌మెంట్స్‌తో లభిస్తుంది. ఈ పరికరంలో మూడు రకాల హీట్ సెట్టింగ్‌లు,
3 రకాల స్పీడ్ సెట్టింగ్‌లు ఉన్నాయి. వీటి సాయంతో మీరు తడి జుట్టును ఆరబెట్టుకోవచ్చు. జుట్టుకు బౌన్సీ కర్ల్స్, అందమైన అలల రూపాన్ని సులభంగా అందించవచ్చు. ఈ పరికరంలోని లార్జ్ రౌండ్ వాల్యూమైజింగ్ బ్రష్ జుట్టుకు మంచి ఆకృతిని ఇస్తుంది. అలాగే దీనిలోని సాఫ్ట్ స్మూతింగ్ బ్రష్ చిక్కులను తొలగిస్తుంది. ఈ పరికరంలో అత్యాధునిక హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది సెకెన్‌కు 40 సార్లు వేడిని చెక్ చేస్తుంది.
దీంతో మీ జుట్టుకు వేడి కారణంగా ఎటువంటి డ్యామేజీ జరగదు. మొత్తంగా ఈ మల్టీ హెయిర్ స్టైలర్ సాయంతో బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా, జుట్టుకు ఎలాంటి డ్యామేజీ కాకుండా ఇంట్లోనే రింగులు తిరిగే ముంగురులను సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ. 45,900.
(చదవండి: