
గులాబీ రేకుల్లాంటి సుకుమారమైన పెదాలంటే మగువలకు మహా ఇష్టం. అందుకోసం ఎన్నో రకాల లిప్‌బామ్‌లని, లోషన్‌లని రాస్తుంటారు. వాటన్నింటి కంటే వంటిల్లోనే దొరికే వాటితో సహసిద్ధమైన పండెరుపు పెదాలను సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో చూద్దామా..!.
ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు బీట్‌రూట్ జ్యూస్‌ని అప్లై చేసి పడుకుంటే పెదవులు పగడాల్లా కాంతులీనుతాయి.
పడుకునే గంట ముందు కొబ్బరి నూనెతో పెదవులను మసాజ్ చేస్తే మరింత నునుపుతేలతాయి.
వెన్నతో పెదవులను సుతిమెత్తగా మసాజ్ చేస్తే అవి గులాబి రంగులోకి మారడమే కాకుండా మృదువుగా మారుతాయి.
ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం, కొన్ని చుక్కల గ్లిజరిన్‌ని కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే పెదవులు నునుపు తేలడమే కాకుండా వాటిపై సన్నని గీతలు మటుమాయమవుతాయి.
కొత్తిమీర జ్యూస్‌తో పెదవులని నాజూగ్గా మసాజ్ చేస్తే గులాబీ పెదవులు మీ సొంతమవుతాయి.
నేతిలో గులాబీ రేకులను మెదిపిన మిశ్రమంతో మసాజ్ చేస్తే పెదవులపై ఉండే గరుకుదనాన్ని తొలగించవచ్చు.
నిమ్మ చెక్కలతో పెదవులపై మసాజ్ చేస్తే వాటిపై ఉండే నలుపు క్రమంగా మటుమాయమవుతుంది.
డ్రైగా ఉన్న పెదవులపై, ల మీగడలో గులాబి రేకులను రంగరించి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
(చదవండి: అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?)