విశాఖ: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలు మాట్లాడతూ ఉంటే తట్టుకోలేక మంత్రుల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ పత్రికా సమావేశంతో ప్రజలకు వాస్తవాల తెలుస్తున్నాయన్నారు. గూగుల్‌ను స్వాగతిస్తున్నామని తాము చెప్పినప్పటికీ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు గుడివాడ అమర్నాథ్.
‘ గూగుల్ - రైడెన్ సంస్థతో ఒప్పందంలో ఉద్యోగాల కోసం ప్రశ్నించాం. గూగుల్- అధాని డేటా సెంటర్ ఏర్పాటులో జరిగిన చర్చల కోసం వైఎస్ జగన్ వివరించారు. డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో అధాని పేరు ఎందుకు చెప్పడం లేదు. ఆధాని పేరు చెప్తే జగన్‌కు మంచి పేరు వస్తుందని వారి బాధ..లక్షా 80 వేల ఉద్యోగాలు ఎలా వస్తాయో క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి. ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాల కల్పన అవుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. క్రెడిట్ కొట్టేయాలని తండ్రీ కొడుకులు చూస్తున్నారు.
ఎల్లో మీడియా రోజూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. సినిమా టైటిల్ వేరు ఎల్లో మీడియా స్టోరీ ఒక్కటే. చంద్రబాబు మొదలు పెట్టి.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి చూపించాలి. ఛాలెంజ్ చేస్తున్నా. భూమి సమీకరణ చెయ్యకుండా చంద్రబాబు దిగిపోయే ముందు భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు. 2వేల 700 ఎకరాలకు 350 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంటే మేం మొత్తం భూమి సేకరణ పూర్తి చేసాం..
నాలుగు గ్రామాలను తరలించి, భోగాపురం ఎయిర్ పోర్ట్ స్థలానికి గోడ నిర్మించాం. ఏ చిక్కులూ లేకుండా.. Gmr కు స్థలం అప్పగించాం. రామాయపట్నం పోర్టును మేమే కట్టాం. ఏ పనీ చెయ్యకపోయినా శిలా ఫలకాలు వేసుకోవడంలో బాబు సిద్దహాస్తుడు. 21 సంవత్సరాల ముందే బాబుకి హైదరాబాద్ తో సంబంధం లేదు. బాబు, లోకేష్ యాడ్ ఏజెన్సీని నడుపుతున్నారు. జగన్ చేసిన మంచిని ఎలాగో చెప్పరు కనీసం అధాని పేరు అయినా చెప్పండి’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి;


