అటు అదానీ డేటా సెంటర్‌.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలకు సీఎం జగన్ అంకురార్పణ

Published Wed, May 3 2023 10:14 AM

Adani Data Center Bhogapuram Airport Specialties   - Sakshi

పనులే ప్రారంభం కానప్పుడు.. అది ఉత్తుత్తి శంకుస్థాపనే అవుతుంది కదా. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది అదే. కానీ, కోర్టు కేసులు పరిష్కరించి.. అన్ని అనుమతులతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తోంది సీఎం జగన్‌ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై కేసుల పరిష్కారం తర్వాత.. కేంద్రం నుంచి ఎన్‌వోసీ తీసుకొచ్చిన సీఎం జగన్‌ ప్రభుత్వం నేడు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే క్రమంలో మొదటి అడుగు వేయబోతోంది. 

ఒకవైపు.. 
రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ అసలైన శంకుస్ధాపన జరగనుంది.  సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణను రాబోయే కాలానికి లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. 

పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్‌ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడిసీఎల్‌) ఒప్పందం

► ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్‌ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం

► అంతర్జాతీయ ఎగ్జిమ్‌ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్‌ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ అభివృద్ది

► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అప్రాన్, ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అండ్‌ టెక్నికల్‌ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్‌

► 16 వ నెంబర్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, కమర్షియల్‌ అప్రోచ్‌ రోడ్, సోలార్‌ ప్యానెల్స్‌ ఏరియా, ఏవియేషన్‌ అకాడమీ, మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవర్‌ హాలింగ్‌ సౌకర్యాలు

► విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు

► ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి. 

ఇదీ చదవండి: అల భోగాపురంలో... నాడు నా(రా)టకం.. నేడు జగ‘నిజం’

ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పునరావాసం
విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది. 

మరోవైపు.. 

► అదానీ డేటా సెంటర్‌.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా... రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ (అదానీ గ్రూప్‌) ఏర్పాటు కానుంది. 

► అదానీ డేటా సెంటర్‌ ద్వారా.. డేటా హబ్‌తో గణనీయంగా పెరగనున్న డేటా స్పీడ్, సింగపూర్‌ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్‌ మెరైన్‌ కేబుల్‌ ఏర్పాటు, తద్వారా ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ 5 రెట్లు పెరిగి భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. 

► విశాఖలో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల వృద్ది, భారీ స్ధాయిలో హైటెక్‌ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం, విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదల

► అధునాతన టెక్‌ కంపెనీలు విశాఖపట్నం ను ఎంచుకునే వీలు, తద్వారా ఐటీ రంగంలో పెరగనున్న ఆర్ధిక కార్యకలాపాలు

► డేటా సెంటర్‌కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్‌ యూనివర్శిటీ, స్కిల్‌ సెంటర్‌ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపుకు మరింత ఊతం, బిజినెస్‌ పార్క్‌ రిక్రియేషన్‌ సెంటర్ల ద్వారా మారనున్న ఉద్యోగుల జీవన శైలి

అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్‌ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కల్గనుంది.

ఇదీ చదవండి: విశ్వనగరంలో వెలుగు రేఖలు

Advertisement
 
Advertisement