రూ. 18,000 కోట్ల పెట్టుబడులు
ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. హైపర్‌వాల్ట్ పేరుతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీపీజీ బిలియన్ డాలర్లు(రూ. 8,870 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా భాగస్వామ్య వెంచర్‌లో 27.5–49 శాతం మధ్య వాటాను పొందనుంది.
టీపీజీని వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వాటాదారులకు పటిష్ట రిటర్నులందించేందుకు వీలుంటుందని టీసీఎస్ పేర్కొంది. అంతేకాకుండా పెట్టుబడి అవసరాలు తగ్గడంతోపాటు.. డేటా సెంటర్ ప్లాట్‌ఫామ్‌కు దీర్ఘకాలిక విలువ చేకూరుతుందని తెలియజేసింది. డేటా సెంటర్లలోకి భారీస్థాయిలో ప్రవేశించనున్నట్లు గత నెలలో టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
6.5 బిలియన్ డాలర్లు
దేశీయంగా 1 గిగావాట్ సామర్థ్య ఏర్పాటుకు 6.5 బిలియన్ డాలర్లు(రూ. 57,650 కోట్లు) వెచి్చంచనున్నట్లు టీసీఎస్ తెలిపింది. వేగంగా పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా దేశంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు టీపీజీ భాగస్వామికావడం సంతోషకరమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దీంతో హైపర్‌స్కేలర్స్, ఏఐ కంపెనీలతో తమ భాగస్వామ్యం మరింత పటిష్టంకానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్M >గా.. 2030కల్లా 10 గిగావాట్లకు బలపడనున్నట్లు అంచనా. ఇప్పటివరకూ డేటా సెంటర్ల బిజినెస్ 94 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం!
టీసీఎస్ షేరు యథాతథంగా రూ. 3,146 వద్ద ముగిసింది.


