ఏడాదిలో 46వేల మంది కొన్న ఈవీ: ఈ కారు గురించి తెలుసా? | MG Windsor Breaks Sales Records As The Top Selling Electric Vehicle In India For 2025, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 46వేల మంది కొన్న ఈవీ: ఈ కారు గురించి తెలుసా?

Jan 5 2026 9:27 PM | Updated on Jan 6 2026 3:31 PM

MG Windsor Tops EV Sales Chart With 46735 Units Sold In 2025

2025లో భారతీయ విఫణిలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా ఎంజీ విండ్సర్ రికార్డ్ సృష్టించిందని.. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించింది.

గత ఏడాది ఎంజీ విండ్సర్ కారు మొత్తం 46735 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి.. ఫోర్ వీలర్ ఈవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. ఇది కొనుగోలుదారులలో దీనికి పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేసింది. కొత్త డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా వాహన ప్రేమికులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాయి.

ఎంజీ విండ్సర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ ప్రో (52.9kWh), ఎసెన్స్ ప్రో (52.9kWh). కస్టమర్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్ లేదా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్‌స్క్రిప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీని ధరలు రూ. 14.00 లక్షల నుంచి రూ. 18.31 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్, బ్యాటరీ ఆప్షన్ల మీద ఆధారపడి ఉంటాయి.

విండ్సర్‌ ఎలక్ట్రిక్ కారులో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 136 పీఎస్ పవర్ 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 37.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్, 52.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో.. రేంజ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement