49 శాతం @ రూ. 17,956 కోట్లు
వార్‌బర్గ్ పింకస్‌తో కలసి పెట్టుబడి
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం దేశీ యూనిట్ హయర్ ఇండియాలో డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యూహాత్మక పెట్టుబడులకు తెరతీస్తోంది. యూఎస్ పీఈ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్‌తో కలసి 49 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించçప్పటికీ 2 బిలియన్ డాలర్లు(రూ. 17,956 కోట్లు) వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
చైనీస్ హయర్ గ్రూప్ అనుబంధ సంస్థ హయర్ ఇండియాలో వార్‌బర్గ్‌తో కలసి వ్యూహాత్మక పెట్టుబడులను చేపట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా ఏసీలు, టీవీల తయారీ దిగ్గజంలో సంయుక్తంగా 49 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది.
హయర్ గ్రూప్ యాజమాన్యం 49 శాతం వాటాను అట్టిపెట్టుకుంటుందని.. మిగిలిన 2% వాటా సంస్థ మేనేజ్‌మెంట్ టీమ్ చేతిలో ఉంటుందని వివరించింది. హయర్ ఇండియా వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్‌సహా పలు కిచెన్ అప్లయెన్సెస్ తయారు చేసే సంగతి తెలిసిందే.
కంపెనీలో వాటా కొనుగోలుకి సజ్జన్ జిందాల్ గ్రూప్ జేఎస్‌డబ్ల్యూ, ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపడినట్లు తెలుస్తోంది. హయర్ ఇండియా విజన్.. మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియాకు తాజా భాగస్వామ్యం దన్నునిస్తుందని భారతీ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. స్థానిక ప్రాధాన్యత, తయారీ సామర్థ్య విస్తరణ, నూతన ప్రొడక్టుల ఆవిష్కరణలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. తద్వారా మార్కెట్లో మరింత లోతుగా విస్తరించనున్నట్లు అభిప్రాయపడింది.


