స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026లో గ్లోబల్ బిజినెస్ లీడర్లు, ఆర్థికవేత్తలు, భారత నాయకులు తమ ప్రత్యేకతను చాటుకుంనేందుకు, ఒప్పందాలు, పెట్టుబడులు అంటూ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు కిక్కిరిసిన కాన్ఫరెన్స్ హాళ్లలో చిక్కటి చలికాలంలో అందిస్తున్న సమోసాలు, కరకర లాడే పకోడీలు ముఖ్యంగా వేడి వేడి 'కిచిడీ' అత్యంత ఆదరణ పొందుతుండటం విశేషం.
వేదిక సమీపంలోని ఫుడ్ కోర్టులో భారతదేశానికి చెందిన ఈ పౌష్టికాహార వంటకం ప్రపంచ నాయకులు, ప్రతినిధుల నోరు ఊరిస్తోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1000 మందికి ఉచితంగా వడ్డిస్తూ, భారతీయ రుచులకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చి పెట్టింది. కమ్మని వాసన, రుచికీ రుచితో ఈ కంఫర్ట్ డిష్ ప్రశంసలు అందుకుంటోంది. దీనికోసం ఎంతో ఓపికగా క్యూలో వేచి ఉండటం విశేషం.
గడ్డకట్టే మంచుతో నిండిన దావోస్ వీధుల్లో వేడి భారతీయ భోజనం (కిచిడీ, సమోసాలు, పకోడాలు) ఇక్కడకు వచ్చే వారికి సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ స్టాల్‌ను సందర్శించి, కిచిడీ రుచి చూసి దాని పోషక విలువలను ప్రశంసించారు. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా దావోస్‌లో ఇండియన్ ఫుడ్ ట్రక్ చిత్రాన్ని పంచుకున్నారు.
ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
VIDEO | Davos: A visitor praising Indian cuisine, especially khichdi, said, “I love Indian food. I love this dish. I’m very happy because I was extremely hungry.”
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/pe3TUR3ofl— Press Trust of India (@PTI_News) January 23, 2026
దావోస్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతుండటంతో, వరుసగా సమావేశాల మధ్య వేడిగా ఉండే కిచ్డీ తమకు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుందంటున్నారు. ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు వేడి వేడి కిచిడీ బావుందని జపాన్ ప్రతినిధి చెప్పారు. ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారతీయ సాంస్కృతిక , ఆర్థిక పాదముద్రకు ఇది సంకేతమంటూ నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్


