ఇద్దరూ క్రూర హంతకులే. ఇద్దరి మధ్యా ప్రేమ కుదిరింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీరిద్దరూ ఇపుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఇందుకోసం హైకోర్టు నుండి 15 రోజుల అత్యవసర పెరోల్ కూడా తీసుకున్నారు. ప్రియుడ్నిఅత్యంతదారుణంగా హత్య చేసిన మహిళ, ఐదుగురిని చంపిన వ్యక్తితో రాజస్థాన్‌లోని అల్వార్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు.
క్రైమ్ థిల్లర్ మూవీ కథను తలపిస్తున్న ఈ కథలో వధువు ప్రియా సేథ్ అలియాస్ నేహా సేథ్, వరుడు హనుమాన్ ప్రసాద్. హత్య కేసులో దోషులుగా తేలి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!
ప్రియా సేథ్ చేసిన భయంకరమైన హత్య
డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని హత్య చేసినందుకు దోషిగా తేలింది ప్రియా. మోడల్‌గా ఉన్న ప్రియా సేథ్, డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడు సింగ్‌ను 2018 మే 2న, సేథ్ తన ప్రియుడు, మరొక వ్యక్తి సహాయంతో హత్య చేసింది. అతణ్ణి కిడ్నాప్ చేసి, అతని తండ్రి నుండి డబ్బు డిమాండ్ చేసి, ఆ డబ్బుతో తన ప్రియుడు దీక్షాంత్ కామ్రా అప్పు తీర్చాలనేది ఆమె ప్లాన్. దీని ప్రకారం టిండర్‌లో అతనితో స్నేహం చేసి రూంకి పిలిపించింది. తరువాత కిడ్నాప్ డ్రామా ఆడి, తండ్రి నుండి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. భయపడి పోయిన ఆయన రూ.3 లక్షలు ఇచ్చాడు. అయితే సింగ్‌ను వదిలిపెడతే తమ గుట్టు బైట పడుతుందన్న భయంతో సేథ్, కామ్రా, మరో స్నేహితుడు లక్ష్య వాలియాతో కలిసి సింగ్‌ను హత్య చేశారు. మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టి ఆమేర్ కొండల్లో పడేశారు. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు అతని ముఖంపై అనేక కత్తిపోట్లు పొడిచి, సాక్ష్యాలను మాయం చేయాలని చూశారు. కానీ మే 3 రాత్రి పోలీసులకు చిక్కక తప్పలేదు. ప్రస్తుతం సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఆరు నెలల క్రితం అదే జైలులో ఆమెకు ప్రసాద్ పరిచయ మయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది.
5 హత్యల వెనుక హనుమాన్ ప్రసాద్
అల్వార్‌లో జరిగిన అత్యంత దారుణమైన హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. ప్రసాద్ తన కంటే 10 సంవత్సరాలు పెద్దదైన తన స్నేహితురాలి భర్త, పిల్లలను హత్య చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు. అల్వార్‌లో తన భర్త, పిల్లలను హత్య చేయాలంటూ తైక్వాండో క్రీడాకారిణి సంతోష్ ప్రసాద్‌ను 2017 అక్టోబర్ 2 రాత్రి ఇంటికి పిలిచింది. ప్రసాద్ మరో సహచరుడితో కలిసి అక్కడికి వచ్చి, వేటకొడవలితో కత్తితో ఆమె భర్త బన్వరీ లాల్‌ను హత్య చేశాడు. అయితే, సంతోష్ ముగ్గురు పిల్లలు, వారితో నివసిస్తున్న మేనల్లుడు ఈ హత్యను చూశారు. పట్టుబడతానేమోనన్న భయంతో, వారిని హతమార్చారు.
ఇదీ చదవండి: అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?


