వంటగ్యాస్‌ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం | Prime Minister Modi holds key meeting on gas shortage | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం

Mar 10 2026 4:16 PM | Updated on Mar 10 2026 5:16 PM

Prime Minister Modi holds key meeting on gas shortage

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. LPG,CNG సంస్థలు పదిశాతం మేర ఉత్పత్తి పెంచాల్సిందిగా కంపెనీలకు ఆదేశించారు. అదేవిధంగా వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలుంటాయని సంస్థలకు హెచ్చరించారు. కాగా చమురు కేంద్రాలు ఇదివరకే ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాయని తెలిపారు. 

దేశంలో చమరు కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌తో చర్చలు జరిపారు.  ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి. దీంతో దేశంలో వంటగ్యాస్ లభ్యతపై సందిగ్ధత ఏర్పడింది. 

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే పలు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరుల తదితర నగరాల్లో హోటళ్లు మూసివేశారు. మావద్ద కొద్ది మేరకే ఎల్‌పీజీ నిల్వలున్నాయని అవి పూర్తయితే తాము సైతం హోటళ్లు మూసివేయాల్సిందేనని పలు హోటళ్ల యజమాన్యాలు కేంద్రం ముందు గోడు వెళ్లగక్కాయి. అయితే త్వరలో ఈ సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తత్తిని పెంచాలని కీలక ఆదేశాలిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement