ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించారు. ఇదే జరిగితే చమురు సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏ మాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. గల్ఫ్ కంట్రీస్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా హర్మూజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడిచమురు రవాణాలో 20 శాతం వరకూ ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీనిని ఇరాన్ బ్లాక్ చేసింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో భారత్‌తో పాటు చాలా దేశాలకు ముడిచమురు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభం తలెత్తే అవకాశం తలెత్తే అవకాశం ఉందని పలు సంస్థలు హెచ్చరించాయి.ఈ నేపథ్యంలోనే ట్రంప్ హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తిని చమురు సంక్షోభానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇరాన్.. హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


