సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ప్రశంసల జల్లు కురిసింది. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం వైఎస్ జగన్ కృషి చేశారని డిబేట్‌లో ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అభినందించారు. ఏపీ క్లీన్ ల్యాండ్ టైటలింగ్ కోసం కృషి చేసిందని గీతా కితాబునిచ్చారు.
చాలా మంచి భూ సంస్కరణలు తీసుకొచ్చారని.. ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చేసింది.. చాలా క్రియేటివ్ గా చేసిందన్న గీతా గోపినాథ్.. ల్యాండ్ కన్వర్షన్ కోసం మంచి విధానాలు అవలంభించారని పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం చర్చా గోష్టిలో కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ సమక్షంలోనే గీతా గోపినాథ వెల్లడించారు. కాగా, వైఎస్ జగన్ ల్యాండ్ టైటిల్ సంస్కరణలపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయగా.. వైఎస్ జగన్ పారదర్శక విధానానికి ప్రశంసలు రావడంతో చంద్రబాబు అండ్ కో అభాసుపాలైంది.


