అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం

Mar 11 2026 7:28 AM | Updated on Mar 11 2026 7:28 AM

అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం హనుమాన్‌ చాలీసా పారాయణం సాయిబాబా సత్సంగ కేంద్రం వార్షికోత్సవం ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం

నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి వద్ద శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల దర్శనార్ధం ప్రత్యేక క్యూలైనులు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులు పి. లక్ష్మీనారాయణ, కన్నా శాస్త్రి భక్తుల గోత్రనామపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమాలను మాజీ సర్పంచ్‌ వలేటి హిమంతరావు, గణపవరం మద్ది లక్ష్మయ్య కంపెనీ ముఠాకూలీలు, కార్మికులు, సిబ్బంది పర్యవేక్షించారు.

వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరు గ్రామ దేవతలు ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ, పరివార దేవతల ఆవరణలో మంగళవారం అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 108 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి నెల రెండవ మంగళవారం జరపతలపెట్టిన కార్యక్రమంలో భాగంగా భక్తులు, వివిధ భజన మండలి వారు పాల్గొని చాలీసా పారాయణం చేశారు. స్వామి వారికి పూజలు చేశారు.

తెనాలి: మండల గ్రామం అంగలకుదురులోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన చేశారు. అనంతరం హారతి, రాత్రి 8 గంటల వరకు సాయిబాబా నామ సంకీర్తనను జరిపారు. ఉదయం 10 గంటలకు భజన, 11 గంటలకు వెస్ట్‌బెర్రీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యంచే సత్సంగం జరిగాయి. మధ్యాహ్నం హారతి, అనంతర ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం అంగలకుదురులో శ్రీరామభక్త హనుమాన్‌ మహిళా కోలాట బృందంచే కోలాటంతో సాయిబాబా నామ సంకీర్తనలతో పురవీధుల్లో చిత్రరాజాలను ఊరేగించారు. రాత్రి అన్నప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

పట్నంబజారు(గుంటూరుఈస్ట్‌):అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు జి.సౌజన్య, ఎ.ఉషాకిరణ్‌ పాల్గొన్నారు. ఆర్టీసీ సర్వీసుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement