అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా బులవాయో వేదికగా అమెరికాతో జరగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు యువ భారత బౌలర్ల ధాటికి 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా టీమిండియా పేసర్ హెనిల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో అమెరికా నడ్డి విరిచాడు.
హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. అమరీందర్ గిల్, అర్జున్ మహేష్ వంటి కీలక వికెట్లను హెనిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
తుది జట్ల వివరాలు:
భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, హెనిల్ పటేల్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్
అమెరికా: సాహిల్ గార్గ్,అమరీందర్ గిల్, అర్జున్ మహేష్,ఉత్కర్ష్ శ్రీవాస్తవ,అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, ఆదిత్ కప్పా, శబరీష్ ప్రసాద్, రిషబ్ షింపీ, రిత్విక్ అప్సిడి


