
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త అందింది. చేతి వేలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్లే ఆఫ్స్ సమయానికి అందుబాటులోకి రానున్నాడు.
ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఓ ప్రముఖ వార్తా సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది. చహల్‌ను నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన నేపథ్యంలో చహల్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది.
కాగా, చహల్ లేని లోటు పంజాబ్‌కు గత మ్యాచ్‌లో (ఢిల్లీతో) బాగా తెలిసొచ్చింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 206 పరుగుల భారీ స్కోర్ చేసినా పంజాబ్ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో చహల్ ఆడి ఉంటే పంజాబ్ మరో విజయం నమోదు చేసేది. అలా జరిగి ఉంటే నేటి మ్యాచ్‌తో (ముంబై) సంబంధం లేకుండా ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచేది.
పంజాబ్ ఇవాళ (మే 26) జైపూర్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ముంబై గెలిచినా అగ్రస్థానానికి చేరుకుంటుంది. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.
పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..
గుజరాత్- 18 (0.254)
పంజాబ్- 17 (0.327)
ఆర్సీబీ- 17 (0.255)
ముంబై- 16 (1.292)
నేటి మ్యాచ్‌లో తుది జట్లు (అంచనా)..
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబే
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా