క్వాలిఫ‌య‌ర్‌-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్‌ | Predicted RCB Playing XI vs PBKS, Qualifier 1: Josh Hazlewood returns | Sakshi
Sakshi News home page

IPL 2025: క్వాలిఫ‌య‌ర్‌-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్‌

May 29 2025 12:48 PM | Updated on May 29 2025 1:11 PM

Predicted RCB Playing XI vs PBKS, Qualifier 1: Josh Hazlewood returns

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025 క్వాలిఫ‌య‌ర్‌-1కు స‌ర్వ‌సిద్ద‌మైంది. చంఢీగ‌డ్‌లోని ముల్లాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్లో అడుగుపెట్టాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జ‌ట్లు స‌మ ఉజ్జీల‌గా ఉండ‌డంతో గెలుపు ఎవ‌రిదో క్రికెట్ నిపుణులు సైతం అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది.

హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?
గాయం కార‌ణంగా గ‌త కొన్ని మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న జోష్ హాజిల్‌వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జ‌ట్టులోకి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. రొమిరియో షెఫ‌ర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి హాజిల్‌వుడ్ రానున్న‌ట్లు ఆర్సీబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

హాజిల్‌వుడ్ తిరిగొస్తే బెంగ‌ళూరు బౌలింగ్ విభాగం మ‌రింత ప‌టిష్టం కానుంది. ఇప్ప‌టికే భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జ‌ట్టులో ఉన్నారు. మ‌రోవైపు గ‌త రెండు మ్యాచ్‌ల‌లో ఇంప్టాక్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. 

అయితే విధ్వంస‌క‌ర ఆట‌గాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్‌లో కూడా ఆడేది అనుమాన‌మే. డేవిడ్ ప్ర‌స్తుతం తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు కోలుకోవడానికి మ‌రి కొంత స‌మయం ప‌డుతోంది.

పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
ఫిల్ సాల్ట్‌, విరాట్ కోహ్లి, మ‌యాంక్ అగ‌ర్వాల్‌, ర‌జిత్ పాటిదార్‌(కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, జితేష్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్‌),  కృనాల్ పాండ్యా, యశ్ దయాల్‌, జోష్ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్‌, నువాన్ తుషారా
చదవండి: ENG vs IND: 'శ్రేయ‌స్ ఏమి త‌ప్పు చేశాడు.. కావాల‌నే ఎంపిక చేయ‌లేదు'
 

Advertisement
 
Advertisement
Advertisement