భారత సైన్యానికి స్పెషల్‌ ట్రిబ్యూట్‌ ఇవ్వనున్న బీసీసీఐ | BCCI Secretary Confirms That IPL 2025 Closing Ceremony Will Be Dedicated To Indian Armed Forces, More Details Inside | Sakshi
Sakshi News home page

IPL closing ceremony: భారత సైన్యానికి స్పెషల్‌ ట్రిబ్యూట్‌ ఇవ్వనున్న బీసీసీఐ

May 27 2025 10:54 AM | Updated on May 27 2025 11:43 AM

BCCI secretary confirms that IPL 2025 closing ceremony will be dedicated to Indian Armed Forces

ఐపీఎల్‌-2025 సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది. మంగ‌ళ‌వారం(మే 27)తో లీగ్ స్టేజి మ్యాచ్‌లు ముగియ‌నున్నాయి. మే 29న తొలి క్వాలిఫ‌య‌ర్‌, మే 30న ఎలిమినేట‌ర్‌, జూన్ 1న క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఆఖ‌రిగా జూన్ 3న అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ ఫైన‌ల్‌కు మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది సీజన్ ఫైన‌ల్ సంద‌ర్బంగా నిర్వ‌హించే ముగింపు వేడుక‌ను భారత సాయుధ దళాలకు అంకిత‌మివ్వాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా ధ్రువీక‌రించారు. ఈ క్లోజింగ్ సెర్మ‌నీ కార్య‌క్ర‌మానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌లను ఆహ్వానించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

"ఆపరేషన్ సిందూర్‌లో మ‌న సాయుధ దళాలు చూపించిన ధైర్య స‌హసాల‌కు బోర్డు సెల్యూట్ చేస్తోంది. ముగింపు వేడుకను మ‌న సైన్యానికి అంకితం చేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని సైకియా స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. 

కాగా పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భారత త్రివిధ దళాలు ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్టాయి. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా పాకిస్తాన్‌, పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లోని ఉగ్ర‌వాద స్ధావరాల‌పై భార‌త బ‌ల‌గాలు దాడులు చేశాయి. ఆ త‌ర్వాత పాక్‌-భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త‌లు త‌లెత్త‌డంతో ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ తిరిగి ప్రారంభ‌మైంది.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌..
 

Advertisement
 
Advertisement
Advertisement