
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ను సొంతం చేసుకోపోయినప్పటికి.. ఆర్సీబీని అభిమానించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బెంగళూరు ఓ డిజిటల్ మైలురాయిని అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా బెంగళూరు అవతరించింది.
ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలో ఆర్సీబీ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లగా ఉండేది. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (18.6 మిలియన్లు), ముంబై ఇండియన్స్ (18 మిలియన్లు)లను బెంగళూరు ఫ్రాంచైజీ దాటిసేంది.
ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టాప్-2 స్ధానం కోసం ప్రయత్నిస్తోంది. ఆర్సీబీకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 27న ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టకలో టాప్-2 స్ధానానికి చేరుకుంటుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్.. ఎనిమిదింట విజయాలో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఐపీఎల్ జట్లు ఇవే:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - 20 మిలియన్లు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- 18.6 మిలియన్లు
ముంబై ఇండియన్స్ (MI)- 18 మిలియన్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- 7.5 మిలియన్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)- 5.4 మిలియన్లు