
ఐపీఎల్-2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ సునీల్ జోషి ధ్రువీకరించాడు. అయితే చాహల్ ఏ గాయంతో బాధపడుతున్నాడన్న విషయాన్ని జోషి స్పష్టం చేయలేదు.
గాయం కారణంగానే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు చాహల్ దూరమయ్యాడు. చాహల్ స్దానంలో ప్రవీణ్ దూబే జట్టులోకి వచ్చాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన దూబే.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
"చాహల్ చిన్న గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడికి మేము విశ్రాంతి. అతడు మా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సునీల్ జోషీ పేర్కొన్నాడు.
ఒకవేళ చాహల్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమైతే పంజాబ్‌కు అది గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.
కాగా పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్ధానం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించిన పంజాబ్‌కు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. మే 26న జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ తలపడనుంది.
చదవండి: IPL 2025: బ్రెవిస్, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్‌కే భారీ స్కోర్