శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్‌ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా? | Is Actress Sreeleela Getting Marriage? Engagement Look Photos Trending On Social Media | Sakshi
Sakshi News home page

శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్‌ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?

May 31 2025 7:40 AM | Updated on May 31 2025 9:58 AM

Sreeleela Engagement look Photos Sher Socilmidia

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ఒకరిగా ఫుల్‌ జోష్‌లో ఉన్న శ్రీలీల(Sreeleela) త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెట్టింట వైరల్‌ అవుతుంది. అందుకు కారణం తాజాగా సోషల్‌మీడియాలో ఆమె షేర్‌ చేసిన వీడియో, ఫోటోలే అని తెలుస్తోంది. కొంత సమయం క్రితం శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఫోటోలు పంచుకుంది. తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు 'బిగ్‌ డే' అంటూనే పూర్తి వివరాలు 'కమింగ్‌ సూన్‌' అంటూ హింట్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేసి.. సైలెంట్‌గా శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందని త్వరలో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు. 

అయితే, అసలు విషయం నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. జూన్‌ 14న శ్రీలీల పుట్టినరోజు ఉంది. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్‌ చేసుకున్నట్లు సమాచారం ఉంది.  ప్రతి ఏటా ఆమెకు ఇది అలవాటుగా చేస్తారని టాక్‌. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను ఈరోజుల్లో కూడా తిధుల ప్రకారం ఇలా జరుపుకునే వాళ్లు ఉన్నారా..! అదీ హీరోయిన్ జరుపుకోవటం వింతగా ఉందని కొందరు చెబుతున్నారు.

ఫోటోలు షేర్‌ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు పూర్తిగా ప్రకటించలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు 'బిగ్‌ డే' అంటూ.. హింట్‌ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్‌ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్‌ కావచ్చని అంటున్నారు. మరోవైపు ఆమె పుట్టినరోజును ఇలా సెలబ్రేట్‌ చేసుకుందని కూడా సమాచారం ఉంది. ఫోటోలు షేర్‌ చేసే సమయంలో కాస్త క్లారిటీగా విషయం చెబితే బాగుంటుంది కదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan),  శ్రీలీల (Sreeleela) డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్‌ బసు దర్శకత్వంలో వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్‌ వచ్చింది. కార్తిక్‌ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ  ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం  జరిగిన ‘ఐఫా’ (IFFA) వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్‌ ఆర్యన్‌ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం' అని ఆమె చెప్పారు. శ్రీలీల నటి మాత్రమే కాదు ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చదువుతుంది.   హీరో తల్లి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement