హాలీవుడ్ యాక్షన్ అడ్చెంచరస్ మూవీ జుమాంజి- ఓపెన్ వరల్డ్. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా చివరి భాగం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ క్రిస్‌మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్ కస్డాన్ దర్శకత్వం వహించగా.. డ్వేన్ జాన్సన్, జాక్ బ్లాక్, కెవిన్ హర్ట్, కారెన్ గిల్లాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ జుమాంజి వీడియోగేమ్ ఆడేవారు నేరుగా అందులోని పాత్రల్లోకి వెళ్లిపోతారు. ఆ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్‌లో గెలవకపోతే వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. అసలు ఈ జుమాంజి ప్రపంచంలో ఏం జరిగింది? అక్కడి జంతువులు వాస్తవ ప్రపంచంలోకి ఎలా వచ్చాయి? అనేది తెలియాలంటే జుమాంజి మూవీ చూడాల్సిందే.


