టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన సామ్.. ఆ తర్వాతే మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఆరు నెలల్లోనే శుభవార్త పంచుకుంది.
తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తాను వర్కవుట్స్ వీడియోను షేర్ చేసింది. గర్భంతో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెట్టిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఈ వీడియోకు #9 The Final Lap అని క్యాప్షన్ పెట్టింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


