శ్రీనిధి శెట్టి, వెంకటేశ్, త్రివిక్రమ్
‘‘ఆదర్శ కుటుంబం’ సినిమాను త్రివిక్రమ్ అద్భుతంగా మలిచారు. ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ మాత్రం నిరాశపరచకుండా ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాల స్థాయిలో అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అని హీరో వెంకటేశ్ తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం ‘హౌస్ నెం: 47’. శ్రీనిధీ శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.
ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. గురువారం జరిగిన సమావేశంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆదర్శ కుటుంబం’ మీ అందరికీ నచ్చుతుందని, థియేటర్లలో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఇంత టైమ్ తీసుకుని ‘ఆదర్శ కుటుంబం’తో మీ ముందుకు వస్తున్నాం’’ అని చె΄్పారు. ‘‘ఎనిమిది పాటలతో జూక్ బాక్స్ రిలీజ్ చేశాం. అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని తమన్ చె΄్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని నారా రోహిత్ పేర్కొన్నారు.


