నిర్మాతగా హన్సిక పెద్దిరెడ్డి.. ‘మైలురాయి’ టైటిల్‌ పోస్టర్‌ లాంచ్‌ | Mailu Rayi Title Poster Released By Nagababu | Sakshi
Sakshi News home page

హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా ‘మైలురాయి’.. టైటిల్‌ పోస్టర్‌ లాంచ్‌

Oct 29 2026 8:19 PM | Updated on Oct 29 2026 8:58 PM

Mailu Rayi Title Poster Released By Nagababu

జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మైలురాయి’. ఈ చిత్రంతో హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా మారుతున్నారు. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రం  టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నటుడు నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టైటిల్ ‘మైలురాయి’ చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’అని అన్నారు.

నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో జగన్ యోగిరాజుతో పాటు దర్శకుడు రఘువర్ధన్ , సహ నిర్మాత తవిటిరాజు తలచింతల  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement