సెంటిమెంట్స్‌ నమ్మను.. నాకు అదే ఫైనల్: వెంకటేశ్ | Venkatesh Comments at Aadarsha Kutumbham Press Meet | Sakshi
Sakshi News home page

Venkatesh: 'బాగలేకపోతే వాళ్లే చెబుతారు'.. ఆదర్శ కుటుంబంపై వెంకీమామ

Oct 29 2026 5:18 PM | Updated on Oct 29 2026 5:25 PM

Venkatesh Comments at Aadarsha Kutumbham Press Meet

వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు హాజరైన హీరో వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాని వెంకటేశ్ తెలిపారు. దీనికి కారణం నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ వల్లే ఇది సాధ్యమైందన్నారు.  ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారని వెల్లడించారు. నా సినిమా బాగుంటే బాగుందని.. బాగోకపోతే బాగోలేదని చెబుతారని వెంకీమామ పేర్కొన్నారు. తనకు ఆడియన్స్‌ తీర్పే ఫైనల్‌ అని.. వాళ్లందరి ప్రేమాభిమానాలతోనే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా ముందుకు సాగుతున్నానని అన్నారు.

ఇద్దరు హీరోయిన్స్, త్రివిక్రమ్‌తో కలిసి మూవీ చేస్తే హిట్‌ అవుతుందన్న సెంటిమెంట్‌ను మీరు నమ్ముతారా అని వెంకీని ప్రశ్నించారు. ఈ సారి కూడా మీకు కలిసొస్తుందని భావిస్తున్నారా? అని అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. నేను ఇలాంటి వాటిని నమ్మనని.. ఆడియన్స్‌ ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనల్ అని అన్నారు. ఇది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని వెంకటేశ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement