వందకోట్ల లగ్జరీ విల్లా?.. స్టార్‌ కమెడియన్ ఇల్లు చూశారా? | Vadivelu Latest House Cost Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Vadivelu: వడివేలా మజాకా.. వందకోట్ల లగ్జరీ విల్లా...!

Oct 29 2026 2:26 PM | Updated on Oct 29 2026 2:28 PM

Vadivelu Latest House Cost Goes Viral In Social Media

సినీ ఇండస్ట్రీలో కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్‌ తీసుకునేది ఎక్కువగా హీరోలే. ఆ తర్వాత హీరోయిన్స్‌తో పాటు మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేసే వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకే తన కెరీర్‌లో కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెడతారు. లగ్జరీ లైఫ్‌తో పాటు స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే హీరోలకు తాము ఏం తక్కువ కాదంటున్నారు కమెడియన్స్‌. టాలీవుడ్‌లో అయితే ఈ విషయంలో మన బ్రహ్మనందాన్ని మించినవారు ఉండకపోవచ్చు.

అయితే కోలీవుడ్‌ విషయానికొస్తే కమెడియన్‌ వడివేలు ఇంటిని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆయన ఇంటిని ఏకంగా రూ.100 కోట్లతో నిర్మించారని టాక్ వినిపిస్తోంది. చంద్రముఖి మూవీలో తన కామెడీతో తెలుగు అభిమానులను నవ్వించిన వడివేలు అత్యంత ఆధునిక వసతులతో ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో మొత్తం 42 ‍అత్యాధునిక సీసీ కెమెరాలు పెట్టారని టాక్. 

కోలీవుడ్‌ కమెడియన్స్‌లో అత్యంత ఖరీదైన లగ్జరీ విల్లా వడివేలుదే కావొచ్చు. సంప్రదాయ తమిళ శైలిలో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన వరండా, వినాయకుడి విగ్రహం, సోలార్ ప్యానెల్స్‌ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యాలయం, కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయట. ఈ ఇంటి విలువ సుమారు రూ.100 కోట్లు పైగానే ఉంటుందని ఈ సౌకర్యాలు చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఈ ఇంటి ధర విషయంలో ఎలాంటి అధికారిక నిర్ధారణ కాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement