ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ ఓ అణుబాంబు.. ఈసారి మాత్రం : రాజీవ్ కనకాల | Rajeev Kanakala Reveals Shooting Update And Exciting Details, Says Jr NTR's Dragon Will Be Like An Atom Bomb, Read Story Inside | Sakshi
Sakshi News home page

Rajeev Kanakala: ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ ఓ అణుబాంబు.. ఈసారి మాత్రం

Oct 30 2026 1:49 PM | Updated on Oct 30 2026 2:40 PM

Actor Rajeev Kanakala About Ntr Dragon movie

జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. రాజీవ్ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలో  కనిపించనున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్న రాజీవ్‌ ‘డ్రాగన్‌’ కోసం ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

సమస్యల వల్ల ఆగాల్సి వచ్చింది
‘డ్రాగన్‌ మూవీ చాలా బాగా వస్తోంది. తారక్‌, ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌', మైత్రి మూవీ మేకర్స్‌ కలవడంతో సినిమా ఇలా అద్భుతంగా వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అణుబాంబులా ఉంటుంది. అభిమానులు కాలర్లు మళ్లీ ఎగరేసేలా ఉంటుంది. ఇప్పటికి 8 రోజుల షూటింగ్‌లో పాల్గొన్నాను. నాకు సంబంధించిన షూటింగ్‌ కొంతమేర ఇంకా ఉంది. కొన్ని సమస్యల వల్ల ఆగాల్సి వచ్చింది.. మళ్లీ వచ్చే నెలలో మొదలు అవుతుంది. అని రాజీవ్‌ వెల్లడించారు. ఇది విన్న తారక్‌ అభిమానులు సంబర పడుతున్నారు.

కాగా ‘డ్రాగన్’ మూవీలో ఎన్టీఆర్‌ సరసన రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీన‌న్‌, ఖుష్బూ సుంద‌ర్‌, గురు సోమ‌సుంద‌రం, అశుతోష్ రానా,  సిద్ధాంత్ గుప్తా, ప్ర‌భాస్ శ్రీను తదితరులు కనిపించనున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 11న రిలీజ్‌ కానుంది.

(ఇదీ చదవండి: మాజీ ముఖ్యమంత్రి జయలలితగా త్రిష..? ఆ బయోపిక్‌లో కీలక మలుపు!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement