'దసరా'తో ఓ మాదిరిగా మెప్పించిన శ్రీకాంత్ ఓదెల.. రీసెంట్‌గా 'ప్యారడైజ్' తీశారు. విడుదలకు ముందు మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. థియేటర్లలో అస్సలు ఆడలేదు. తెలంగాణలో పర్లేదనిపించింది గానీ ఆంధ్రతో పాటు మిగిలిన చోట్ల ఫ్లాప్ అయింది. ఇదలా ఉంచితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత మూవీలోని కంటెంట్ అంతా ట్రోలింగ్ బారిన పడింది. దీంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు హీరో నానిపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)
నాని ఇప్పటికే తన కొత్త సినిమా 'బ్లడీ రోమియో' బిజీలో పడిపోయాడు. శ్రీకాంత్ విషయానికొస్తే.. 'ప్యారడైజ్' తర్వాత లెక్క ప్రకారం చిరంజీవితో కలిసి పనిచేయాలి. ఈ మేరకు చాన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. కానీ 'ప్యారడైజ్' రిలీజ్ కావడానికి ముందే చిరు-ఓదెల ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. దీనికి తోడు నాని కూడా ఈ మూవీ మొదలవడానికి ఇంకాస్త టైమ్ పడుతుందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో అయినా ఉంటుందిలే అని నెటిజన్లు అనుకున్నారు.కానీ ఇప్పుడది సైడ్ అయిపోయినట్లే అనిపిస్తుంది.
ఎందుకంటే శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ విభజన బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఓ ప్రేమకథ రాశాడట. దాన్ని సినిమా చేయాలనుకుంటున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం చిరు సినిమా సందిగ్ధంలో పడినట్లే. ఎందుకంటే శ్రీకాంత్ తీయబోయే ప్రేమకథ హిట్ అయితే చిరంజీవి మనసు మారొచ్చు. లేదంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉండటం కష్టమే. అయితే శ్రీకాంత్ చేసిన దసరా, ప్యారడైజ్ సినిమాల కారణంగా ఇతడిపై తెలంగాణ దర్శకుడు అనే ముద్రపడిపోయింది. దీంతో తెలంగాణలో ఈ మూవీస్ బాగానే ఆడినా ఆంధ్రలో అస్సలు వర్కౌట్ కాలేదు. మరి త్వరలో తీయబోయే ఈ చిత్రంతోనైనా తనపై ముద్ర చెరిపేసుకుంటాడా? లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు)


