రౌడీ అల్లుడు @ 35 | chiranjeevi rowdy alludu 35 years geetha arts celebrations | Sakshi
Sakshi News home page

రౌడీ అల్లుడు @ 35

Oct 20 2026 4:26 AM | Updated on Oct 20 2026 4:26 AM

chiranjeevi rowdy alludu 35 years geetha arts celebrations

చిరంజీవి హీరోగా నటించిన ‘రౌడీ అల్లుడు’ సినిమా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన, దివ్య భారతి హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, కోటా శ్రీనివాసరావు,  కైకాల సత్యనారాయణ, జె.వి.సోమయాజులు, అన్నపూర్ణ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ మూవీ 1991 అక్టోబరు 18న విడుదౖలై 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్‌ సంస్థలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ‘‘చిరంజీవి కెరీర్‌లో ‘రౌడీ అల్లుడు’ చిత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆయన కామెడీ టైమింగ్, స్టైల్, స్వాగ్, డ్యాన్స్ లకు ఈ మూవీ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ఆయన ద్విపాత్రాభినయం, చిత్రంలోని ఆసక్తికరమైన కథనం, బప్పీలహిరి గుర్తుండిపోయే సంగీతం కలసి ‘రౌడీ అల్లుడు’ ప్రేక్షకుల అభిమాన చిత్రంగా నిలిచిపోయింది’’ అని మేకర్స్‌ పేర్కొ న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement