సినీ ఇండస్ట్రీలో విషాదం.. అదుర్స్ బామ్మ ఇకలేరు | Veteran Tamil actor Vatsala Rajagopal dies at 93 in Chennai | Sakshi
Sakshi News home page

Vatsala Rajagopal: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అదుర్స్ బామ్మ కన్నుమూత

Oct 30 2026 2:58 PM | Updated on Oct 30 2026 3:28 PM

Veteran Tamil actor Vatsala Rajagopal dies at 93 in Chennai

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి వత్సల రాజగోపాల్(93) కన్నుమూశారు. తీవ్రమైన వృద్ధాప్య సమస్యలతో బాధుపడుతున్న ఆమె చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని చెన్నైలోని పల్లవరంలో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఆమె తెలుగులోనూ సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ చిత్రంలో భామగా మెప్పించారు. తమిళంలో రోజా, అన్నియన్, సతి లీలావతి, మొళి వంటి చిత్రాలలో కనిపించారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన వత్సలకు పాఠశాలలో ఉన్నప్పుడే నృత్యం, నాటకరంగంపై ఆసక్తి కలిగింది. నాటకరంగంపై ఉన్న ఆసక్తి ఉన్న ఓ నాటక బృందంలో చేరారు. అలా వివాహం తర్వాత ఆమె 1953లో చెన్నైకి వచ్చిన ఆమె క్లర్క్‌గా పనిచేశారు.

ఆమె రంగస్థల ప్రదర్శనలు డైరెక్టర్ మణిరత్నం దృష్టిని ఆకర్షించాయి. అలా ఆమెకు 'రోజా' చిత్రంలో ఒక పాత్రను అందించారు. 1992లో వచ్చిన ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌ మధు అమ్మమ్మ పాత్రను పోషించారు. సినిమా రంగంలో తన మొదటి నటనా అవకాశం వచ్చినప్పుడు ఆమె వయస్సు సుమారు 60 సంవత్సరాలు కావడం విశేషం. తన కెరీర్‌లో ఆమె దాదాపు 400కు పైగా చిత్రాలలో నటించారు. ఆమె నటించిన  సతీ లీలావతి, రిథమ్', విన్నర్, పట్టియల్, ధామ్ ధూమ్, 'కళ్యాణ సమయల్ సాదం లాంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆమె చిత్తి, ఆనందం, ముంధనై ముడిచ్చు, వసంతం లాంటి సీరియల్స్‌లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement